![]() |
![]() |

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'పొదరిల్లు'(Podharillu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -27 లో... చక్రి, మహాల వెంట రౌడీలు పడుతుంటారు. దాంతో వాళ్లు స్టేషన్ లోపలకి వస్తారు. స్టేషన్ లోపలికి రౌడీలు వచ్చి.. వాళ్లపై ఎటాక్ చేస్తారు. అప్పుడే ఏంటి మీ గొడవ అని పోలీసులు రౌడీలపై కోప్పడతారు. అప్పుడే ఆది, ప్రతాప్, భూషణ్ కూడా స్టేషన్ లోకి ఎంట్రీ ఇస్తారు. వాళ్ళు చక్రిపై గొడవకి వెళ్తుంటే.. పోలీసులు అడ్డుపడతారు.
మహా మాతో వచ్చేయ్ అని ప్రతాప్ అనగానే.. చక్రి చెయ్ పట్టుకొని నేను రానని మహా అంటుంది. నువ్వు రా పెళ్లి టైమ్ కి వెళ్ళాలని భూషణ్ అంటుంటే.. నీతో పెళ్లి ఇష్టం లేదనే వచ్చాను.. మళ్ళీ ఎందుకు వస్తానని మహా అంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని ఇన్‌స్పెక్టర్ అంటాడు. తనకి పెళ్లి ఇష్టం లేక వచ్చేసిందని చక్రి అంటాడు. ఇన్‌స్పెక్టర్ చక్రిని పక్కకి తీసుకొని వెళ్లి.. అసలు ఏమైందని అడుగుతాడు. ఏం లేదు సర్ అక్కడున్న వాడితో పెళ్లి ఇష్టం లేక ఆ అమ్మాయి వచ్చేసింది. మరి నువ్వు అంటే ఇష్టమా అని అడుగుతాడు. ఆమె నాకు ఇష్టం.. తనకి నేను ఇష్టమో లేదో తెలియదు.. తన ఇష్టమే నా ఇష్టమని చక్రి అంటాడు. దాంతో ఇన్‌స్పెక్టర్ కన్ఫ్యూజ్ అవుతాడు. అ తర్వాత మహాని ప్రతాప్ రిక్వెస్ట్ చేస్తాడు. నేను రానని మహా మొహంపైనే చెప్పేస్తుంది.
అ తర్వాత నేను నా కూతురితో ఒక అయిదు నిమిషాలు మాట్లాడుతానని ఇన్స్పెక్టర్ ని ప్రతాప్ రిక్వెస్ట్ చేస్తాడు. లేదు సర్ మీరు బలవంతంగా అమ్మాయిని తీసుకొని వెళ్తే మా ఉద్యోగం పోతుందని ఇన్‌స్పెక్టర్ అంటాడు. లేదు మాట్లాడుతానని ప్రతాప్ అనగానే సరే అని ఇన్‌స్పెక్టర్ అంటాడు. నిన్ను ప్రాణంగా పెంచాను కదా అని మహాతో ప్రతాప్ ఎమోషనల్ అవుతాడు. నాన్న మీరు వాడితో పెళ్లి వద్దంటే ఇప్పుడే మీతో వస్తానని మహా అనగానే భూషణ్ తో నీ పెళ్లి జరగాల్సిందేనని ప్రతాప్ అంటాడు. తరువాయి భాగంలో మీ నాన్న ఎలా అయిన పెళ్లి చేస్తాడు. అదేదో అతన్ని చేసుకొని హ్యాపీగా ఉండమని చక్రిని ఉద్దేశ్యించి ఇన్ స్పెక్టర్ చెప్తాడు. దాంతో మహా షాక్ అవుతుంది. అ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |